తూర్పుగోదావరి జిల్లాలో వింత | Strange in east godavari district | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లాలో వింత

Oct 28 2017 12:16 PM | Updated on Oct 28 2017 4:01 PM

Strange in east godavari district

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో శనివారం వింత చోటు చేసుకుంది.

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో శనివారం వింత చోటు చేసుకుంది. రుబ్బు రోలు నుంచి తెల్లని ద్రవం వస్తుండటంతో స్థానికులు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.  రోలు నుంచి ఊరుతున్న తెల్లని ద్రవం పాలు అని స్థానికులు అంటున్నారు.

పాలను తోడిన తర్వాత కూడా తిరిగి వస్తున్నాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టు పక్కల గ్రామాల వారికి తెలయడంతో ప్రజలు ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. అంతేకాకుండా రుబ్బురోలుకు పూజలు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement