శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుండడంతో డ్యాం నీటిమట్టం ఆదివారం సాయంత్రం సమయానికి ....
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుండడంతో డ్యాం నీటిమట్టం ఆదివారం సాయంత్రం సమయానికి 809.90 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.895 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 4,088 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.
తెలంగాణ ప్రాంతంలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2.399 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసి 5,350 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3 జనరేటర్లు ఒక్కొక్కటి 82.3 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పాదన చేయగా, భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్ 140 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పాదన జరిగింది. లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు రెండు పవర్‌హౌస్‌లలో పీక్‌లోడ్ అవర్స్‌లో ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయంలో 34.2438 క్యూసెక్కుల నీరు నిల్వగా ఉంది.