రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని ఆ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా గోరంట్లలోని ఏటి గంగమ్మ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోరంట్ల (అనంతపురం) : రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని ఆ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా గోరంట్లలోని ఏటి గంగమ్మ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా జగన్ దీక్ష విజయవంతం కావాలని గంగమ్మను వేడుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలువురు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తున్న తమ నాయకుడిపై కేవలం చంద్రబాబు మెప్పు కోసం, తమ పదవులను కాపాడుకోనేందుకు మంత్రులు లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చిన బీజేపీని నిలదీస్తే కేంద్ర ప్రభుత్వంలో చలనం వస్తుందన్నారు.