దొంగను పట్టించిన సమయస్పూర్తి | reward for brave young man | Sakshi
Sakshi News home page

దొంగను పట్టించిన సమయస్పూర్తి

Sep 15 2015 8:56 AM | Updated on Jun 1 2018 8:31 PM

మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతున్న దుండగులను పట్టిచ్చిన యువకుడిని అభినందించిన పోలీసులు

మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతున్న దుండగులను పట్టిచ్చిన యువకుడిని పోలీసులు అభినందించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఎం.పద్మావతి (48) సోమవారం నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో గొలుసును తెంపుకొని పోయారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న గీతాప్రసాద్ అనే యువకుడు ఆమె కేకలు విని దుండగుల బైక్‌ను తన బైక్‌తో ఢీకొట్టించాడు. దీంతో ఆగంతకులు పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వారిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.  నిందితులను నగరానికి చెందిన షేక్ సర్వర్ వలీ, మహ్మద్ అలీగా గుర్తించారు. గీతాప్రసాద్ సమయస్ఫూర్తిని ఎస్పీ రాజశేఖర్‌బాబు మెచ్చుకున్నారు. గీతాప్రసాద్‌కు రూ.5 వేలు రివార్డు అందజేశారు. గీతా ప్రసాద్ సాహస కృత్యాన్ని జాతీయ అవార్డుకు సిఫారసు చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement