నాణ్యమైన విద్య బాధ్యత వర్సిటీలదే | Responsible for the quality of the education varsitilade | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య బాధ్యత వర్సిటీలదే

Jan 5 2014 2:30 AM | Updated on Sep 2 2017 2:17 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్య, సమాజాభివృద్ధికి దోహదపడే పరిశోధనలు అందించే బాధ్యత యూనివర్సిటీలదేనని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.

=‘రూసా’తో వర్సిటీల అభివృద్ధికి నిధులు
 =వర్సిటీల బలోపేతానికి చర్యలు
 =ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి

 
యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: విద్యార్థులకు నాణ్యమైన విద్య, సమాజాభివృద్ధికి దోహదపడే పరిశోధనలు అందించే బాధ్యత యూనివర్సిటీలదేనని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఎస్వీయూ అతిథిగృహంలో శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’కు ప్రత్యేక ఇంట ర్వ్యూ ఇచ్చారు.  వర్సిటీల అభివృద్ధికి తీ సుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీలు ఆర్థిక లోటు తో కొట్టుమిట్టాడుతున్నాయి. 2013- 14 ఆర్థిక సంవత్సరంలో   వర్సిటీల బ డ్జెట్‌ను ప్రభుత్వం పెంచింది.

2014- 15 సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి  ప్రభుత్వం ఏమేరకు బడ్జెట్ పెం చుతుందో అనుమానమే. అయితే కేంద్రప్రభుత్వం ఉన్నత విద్య అభివృద్ధికి రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్(రూసా) అనే కొత్త పథకం ప్రవేశపెట్టింది. కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ పథకం అమలు చేస్తుంది. సుమారు పదేళ్లపాటు ఈ ప థకం అమలులో ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి రెండేళ్లకు రెండువేల కోట్ల రూ పాయల నిధులు రానున్నారుు. రెండేళ్ల తర్వాత మరో ఐదువేల కోట్లు రానున్నాయని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
 
అటానమస్ కళాశాలలకు వర్సిటీస్థాయి  
 
రూసా పథకం కింద అటానమస్ కళాశాలను వర్సిటీలుగా అప్‌గ్రేడ్ చేయనున్న ట్లు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నాక్ ఎ-గ్రేడ్,  కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కలిగి ఉండి, మూడువేల మంది విద్యార్థులు ఉన్న కళాశాలలను  వర్సిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు.

అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు  
 
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అ నుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. భర్తీ ప్రక్రియ కొకనసాగుతోందన్నారు.అధ్యాపక పోస్టుల భర్తీలో వీసీలు అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకు వచ్చేందుకు కూ డా కృషి చేస్తున్నామన్నారు. బోధనా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉందని, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సిలబస్‌ను మార్చాల్సిన అవసరాన్ని  వర్సిటీలు గుర్తించాలని ఆయన సూచించారు.
 
కొందరు కళంకం తెస్తున్నారు
 
కొందరు వీసీలు, ఇతర అధికారులు ఉన్నత విద్యకు కళంకం తెస్తున్నారని ఆయన అన్నారు.  నిధులు పెంచుకోవడం కోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటూ దారితప్పుతున్నారన్నారు. గ తంలో కుప్పంలోని ద్రవిడ వర్సిటీ, కర్నూలులోని రాయలసీమ వర్సిటీ సరైన నిబంధనలు పాటించకుండా లెక్కకుమించి పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చాయని తెలిపారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. స్పష్టమైన లక్ష్యం కలిగి, దాన్ని సాధిం చేందుకు కృషి చేయూలని ఆయన సూచించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement