సైనికస్కూల్ ఫలితాలు విడుదల | Released the results of a military school | Sakshi
Sakshi News home page

సైనికస్కూల్ ఫలితాలు విడుదల

Feb 6 2016 4:46 AM | Updated on Oct 9 2018 7:52 PM

సైనికస్కూల్ ఫలితాలు విడుదల - Sakshi

సైనికస్కూల్ ఫలితాలు విడుదల

2016-17 సంవత్సరానికి కోరుకొండ సైనిక పాఠశాలలో ఆరు, తొమ్మిది తరగతులలో ప్రవేశానికి 2016 జనవరి 3న నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను

విజయనగరం రూరల్: 2016-17 సంవత్సరానికి కోరుకొండ సైనిక పాఠశాలలో ఆరు, తొమ్మిది తరగతులలో ప్రవేశానికి 2016 జనవరి 3న నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను  సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్‌కెప్టెన్ పి.రవికుమార్ శుక్రవారం విడుదల చేశారు.  ఆరో తరగతిలో 90 సీట్లకు 255 మంది, తొమ్మిదో తరగతిలో 20 సీట్లకు  51 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారని ఆయన తెలిపారు.

వీరికి ఈ నెల 17వ తేదీనుంచి  సైనిక పాఠశాలలో ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ నెల 12వ తేదీ నాటికి ఇంటర్వ్యూకు కాల్ లెటర్ అందని విద్యార్థులు సమాచారం కోసం 08922-246119 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను సైనిక పాఠశాల వెబ్‌సైట్ www. sainikschoolkorukonda.orgÌZ పొందుపరిచామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement