'ఎర్ర' దొంగల ముఠా అరెస్ట్ | redsand thieves arrest in ysr district | Sakshi
Sakshi News home page

'ఎర్ర' దొంగల ముఠా అరెస్ట్

Aug 23 2015 1:43 PM | Updated on Sep 3 2017 8:00 AM

'ఎర్ర' దొంగల ముఠా అరెస్ట్

'ఎర్ర' దొంగల ముఠా అరెస్ట్

వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు కారులో ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.

బద్వేల్ అర్బన్ (వైఎస్సార్ జిల్లా): వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు కారులో ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి ఒక కారు, 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌ జిల్లా బద్వేల్ మండలం బ్రాహ్మణపల్లె నుంచి పీపీ కుంట వెళ్లే రహదారిలోని బెడుసుపల్లె క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి కారును వదిలేసి పరారయ్యేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement