19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sandalwood surrendered in ysr district | Sakshi
Sakshi News home page

19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Jan 25 2017 10:46 AM | Updated on Aug 21 2018 6:22 PM

వైఎస్సార్‌ జిల్లాలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మైదుకూరు: వైఎస్సార్‌ జిల్లాలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు సమీపంలోని ఏటూరు కాలువ కట్టపై ఓ స్కార్పియో వాహనం ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున అక్కడికివెళ్లి ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు సీఐ వెంకటేశ్వర్లు డీఎస్పీ శ్రీలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement