నా అనుమానాలకు బలం చేకూర్చేలా ఉంది: రమణ దీక్షితులు

Ramana Deekshtulu On Maha Samprokshana Issue In TTD - Sakshi

సాక్షి, చెన్నై : మహా సంప్రోక్షణ పేరుతో ఆగస్టు 9 నుంచి 16 వరకు ఆలయాన్ని మూసేస్తామన్న టీటీడీ నిర్ణయంపై రమణ దీక్షితులు స్పందించారు. భక్తుల నుంచి ఆగ్రహజ్వాలలు ఎదురయ్యేసరికి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ... మహా సంప్రోక్షణపై చైర్మన్‌కు అవగాహన లేదని అన్నారు. భక్తులను ఆలయానికి అనుమతించకూడదనే నిర్ణయం సరైనది కాదని, భక్తులకు భగవంతున్ని దూరం చేయాలనే ప్రయత్నమేనని తప్పుబట్టారు.

గతంలో టీటీడీపై తాను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు తన ఆరోపణలకు పాలకమండలి, ప్రభుత్వం జవాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆలయంలో రహస్యంగా సంప్రోక్షణ పూజలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. స్వామి వారి సంపదను దోచుకోవాలనే ప్రయాత్నాన్ని అడ్డుకునేందుకే సీబీఐ విచారణ కోరుతున్నానని తెలిపారు. స్వామి వారకి అపచారం చేయకుండా సంప్రోక్షణ నిర్వహించండని టీటీడీని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top