తిలోదకాలిచ్చిందని టీడీపీయే: రఘువీరా | Raghuveera Reddy slams TDP on By-polls | Sakshi
Sakshi News home page

తిలోదకాలిచ్చిందని టీడీపీయే: రఘువీరా

Sep 1 2014 9:57 AM | Updated on Aug 29 2018 6:00 PM

తిలోదకాలిచ్చిందని టీడీపీయే: రఘువీరా - Sakshi

తిలోదకాలిచ్చిందని టీడీపీయే: రఘువీరా

ఎవరైనా మరణిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులను నిలబెట్టని సంప్రదాయానికి తిలోదకాలిచ్చిందని టీడీపీయేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు.

విజయవాడ: ఎవరైనా మరణిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులను పోటీకి నిలబెట్టని సంప్రదాయానికి తిలోదకాలిచ్చిందని టీడీపీయేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. నందిగామ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలపడాన్ని ఆయన సమర్థించుకున్నారు.

రాష్ట్రంలో ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు అమలుచేయడం లేదని ఆయన ఆరోపించారు. రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు చేయడం లేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement