క్వార్టర్లీ పరీక్షలు దగ్గర పడుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని తరగతుల విద్యార్థులను సమాయత్తం చేయాలని,
సిలబస్ త్వరగా పూర్తి చేయండి
Published Thu, Oct 24 2013 2:41 AM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ :క్వార్టర్లీ పరీక్షలు దగ్గర పడుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని తరగతుల విద్యార్థులను సమాయత్తం చేయాలని, సిలబస్‌ను త్వరగా పూర్తి చేయాలని జిల్లా జేసీ వివేక్‌యాదవ్ ఆదేశించారు. బుధవారం స్థానిక పాతబస్టాండ్ సెంటర్‌లోని పరీక్షాభవన్‌లో గుంటూరు డివిజన్ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల విద్యార్థులకు కొంత సిలబస్ విషయంలో సమయం వృధా అయిందని, ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి విద్యార్థులను కార్టర్లీ పరీక్షలకు సిద్ధం చేయాలని ఆదేశించారు.
డీఈవో డి.ఆంజనేయులు, డిప్యూటీ డీఈవో కెఎస్ ప్రకాశరావు మాట్లాడుతూ క్వార్టర్లీ పరీక్షలు డిసెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నామని తెలిపారు. 10వ తరగతిలో విద్యార్థులకు గత ఏడాది ఈ సమయానికి ఎంత సిలబస్‌ను పూర్తి చేశారో, ఇప్పుడు ఎంత సిలబస్ పూర్తి చేశారో సరిచూసుకుని విద్యార్థులను పరీక్షలకు సిద్ధంచేయాలన్నారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్న పాఠశాలల్లో ఏవిధంగా విద్యను అందిస్తున్నారో, ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయో, ఎన్ని పని చేస్తున్నాయో, టీచర్‌పేరు, సెల్‌నంబర్లతో వివరాలను వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులకు అందజేయలని ఆదేశించారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీ పోస్టులు తదితర వివరాలు జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సామర్థ్యాన్ని బట్టి మినిమం మెటీరియల్‌ను ఉపాధ్యాయులు తయారుచేసి 15 రోజుల్లోగా అందించాలని సూచించారు. సంపూర్ణ విద్యాదర్శిని విభాగంలో విద్యార్థుల మార్కులు తదితర విషయాలను వెంటనే ఎన్‌రోల్ చెయ్యాలన్నారు. కౌమార విద్య కార్యక్రమంలో భాగంగా ఈనెల 26వ తేదీన బోయపాలెంలోని డైట్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక తరగతులకు బోయపాలెం పరిసరప్రాంతాల విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ మొబలైజేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు తమకు అందుబాటులో ఉన్న ఎన్నారైలు తదితరుల నుంచి నిధులు సేకరించి అవసరమైన వసతులు కల్పించుకోవాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement