ఉమాశంకర్‌కు సోదరుల అభినందనలు

Puri jagannath Welcomes His Brother Uma Shankar Ganesh - Sakshi

మాకవరపాలెం (నర్సీపట్నం) :ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గానికి వస్తున్న ఉమాశంకర్‌గణేష్‌కు తన సోదరులు పూరీ జగన్నాథ్, సాయిరాంశంకర్‌లు కూడా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. వీరు శుక్రవారం మండలంలోని వెంకన్నపాలెం చేరుకుని గణేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు కార్యకర్తలు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వీరితో కరచాలనం చేయడంతో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు.

పూరీ, జమీలు భేటీ
నాతవరం:  ప్రజలు రాజన్న రాజ్యం కోసమే సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి ఉహించని విధంగా భారీ మెజార్టీ ఇచ్చారని సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అంకంరెడ్డి జమీలు అన్నారు.వీరు శుక్రవారం నర్సీపట్నం ఎమ్మెల్యే విజేత పెట్ల ఉమా శంకర్‌గణేష్‌ నివాసంలో కలిశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top