శంకర్ అనే మెకానిక్ ఆత్మహత్య కేసులో హైదరాబాద్ లాలపేట పోలీసులపై వచ్చిన ఆరోపణలపై గుంటూరు జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు
గుంటూరు: శంకర్ అనే మెకానిక్ ఆత్మహత్య కేసులో హైదరాబాద్ లాలపేట పోలీసులపై వచ్చిన ఆరోపణలపై గుంటూరు జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఓఎస్డీ జగన్నాథరెడ్డిని నియమించారు. విజయవాడ విజేత ఆస్పత్రిలో విచారణ కొనసాగుతోంది. కాగా లాలాపేట పోలీసులపై కేసు నమోదు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు. లాలాపేట సీఐ వినయ్ కుమార్, ఎస్ఐ వీరాస్వామి, ఏఎస్ఐ నాయక్, కానిస్టేబుల్ మజారుల్లాలపై మృతుడు శంకరరావు భార్య గుణవాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.