నల్లమలలో భారీ డంప్‌ స్వాధీనం | prakasam police found maoist dump nallamala forest area | Sakshi
Sakshi News home page

నల్లమలలో భారీ డంప్‌ స్వాధీనం

Jan 28 2017 10:04 AM | Updated on Sep 5 2017 2:21 AM

(ఫైల్ ఫొటో)

(ఫైల్ ఫొటో)

ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

ఒంగోలు : ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లతో క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మావోయిస్టులు పాతిపెట్టిన డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నల్లమల అటవీ ప్రాంతం పాలుట్ల సమీపంలో పాత డంప్‌ను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఈ డంప్‌లో పెద్ద ఎత్తున తుపాకులు, పలు రకాల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సమయంలో డంప్‌ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement