సీఎం జగన్ వన్‌ మ్యాన్ ఆర్మీ: పోసాని | Posani Krishna Murali Said CM YS Jagan Are One Man Army | Sakshi
Sakshi News home page

సీఎం జగన్ వన్‌ మ్యాన్ ఆర్మీ: పోసాని

May 23 2020 9:05 PM | Updated on May 23 2020 9:05 PM

Posani Krishna Murali Said CM YS Jagan Are One Man Army - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వన్‌మ్యాన్‌ ఆర్మీ అని.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దాదాపు అన్ని హామీలను అమలు చేశారని సినీనటుడు పోసాని కృష్ణమురళీ కొనియాడారు. శనివారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లా ఏ రాష్ట్రం కూడా ఇలా చేయలేదన్నారు. విశాఖ గ్యాస్‌ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారని.. దేశంలో కోటి రూపాయల పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారు.
(జగన్‌ చూపిన ఆప్యాయతతో నూతనోత్తేజం)

చంద్రబాబు హయాంలో పుష్కరాల మృతులకు ఇచ్చింది రూ.10 లక్షలేనని, విశాఖ గ్యాస్ ఘటనకు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ పథకాలన్నీ చాలా బాగున్నాయన్నారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్లను ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు, సోనియా, అహ్మద్ పటేల్, చిదంబరం కలిసి కుట్రలు చేసి జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టించారని పోసాని మురళీకృష్ణ పేర్కొన్నారు.
(సోషల్ మీడియాలో జగన్‌ మేనియా) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement