సోషల్ మీడియాలో జగన్‌ మేనియా | Ys Jagan Mohan reddy in Top trend after 1YearForYSRCPMassVictory | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో జగన్‌ మేనియా

May 23 2020 8:21 PM | Updated on May 23 2020 8:51 PM

Ys Jagan Mohan reddy in Top trend after 1YearForYSRCPMassVictory - Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ చారిత్రక విజ‌యం సాధించి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాము అమితంగా అభిమానించే నాయకుడి ఫోటోలు, వీడియోలు, డైలాగులను సామాజిక మాద్యమాల్లో పోస్ట్‌ చేశారు. 151 సీట్లు గెలిచిన చారిత్రాత్మక విజ‌యానికి ఏడాది పూర్తయిన సంద‌ర్భాన్ని పండ‌గ‌లా జ‌రుపుకున్నారు. 

ఈ నేప‌థ్యంలో వైఎస్‌ జ‌గ‌న్‌ అభిమానులు ట్విటర్‌లో సృష్టించిన ట్రెండ్ ప్రపంచ స్థాయిలో మార్మోగిపోయింది. మే 22 సాయంత్రం 6 గంట‌ల నుంచి మే 23 సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు.. 24 గంట‌ల పాటు జ‌గ‌న్ అభిమానులు  #RiseOfYSJagan , #1YearForYSRCPMassVictory  #1YearOfByeByeBabu హ్యాష్‌ట్యాగ్‌ల‌తో ఇంటి నుంచే విజ‌యోత్సవం జ‌రుపుకున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా క‌ల‌వ‌లేక‌పోయినప్పటికీ, ట్విటర్‌లో మాత్రం ట్వీట్ల వ‌ర‌ద పారించారు. #1YearOfByeByeBabu, #1YearForYSRCPMassVictory హ్యాష్‌ట్యాగ్‌లు వ‌ర‌ల్డ్ వైడ్ ట్రెండ్ కావ‌డం విశేషం. ఇండియా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌లో రోజంతా ఈ 3 హ్యాష్ ట్యాగ్‌లు ‌టాప్‌లో ట్రెండ్ అయ్యాయి. సినిమాల‌కు సంబంధించిన ట్విటర్‌ ట్రెండ్‌లు కనిపించ‌డం సర్వసాధార‌ణం. కానీ, వైఎస్సార్‌సీపీ అభిమానులు సృష్టించిన పొలిటిక‌ల్ ట్రెండ్ ఈ రేంజ్ లో ప్రపంచ‌వ్యాప్తంగా టాప్‌లో ఉండటం ఖ‌చ్చితంగా విశేష‌మే. వైఎస్ జ‌గ‌న్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని గురించి మ‌రోసారి రుజువు చేసింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement