సీఎం కార్యాలయంలో అధికారుల శాఖలు ఇవే

Portfolios Of The AP CMO Officers  - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయించారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర అధికారులు అందరికీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ఈ కేటాయింపులు చేశారు. 

అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు: 
సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు.

పీవీ రమేష్, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ: 
వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్‌ఫ్రా, ఇంధన శాఖ. 

సొల్మన్‌ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి: 
ట్రాన్స్‌పోర్ట్‌ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు.

కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి:
నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్, సీఆర్‌డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం. 

జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి:
పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతి.

డాక్టర్‌ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి:
ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు).

పి.కృష్ణమోహన్‌రెడ్డి, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ):
ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్‌ టు మినిట్‌ ప్రోగ్రామ్, అపాయింట్‌మెంట్స్, విజిటర్స్‌ అపాయింట్‌మెంట్స్‌.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top