సంకాంత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోడిపందేలు జోరందుకున్నాయి.
హైదరాబాద్: సంకాంత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోడిపందేలు జోరందుకున్నాయి. పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు జరిపి పందెంరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లిలో 17 మంది పందెంరాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి 7 వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం గుడాలగొందిలో 16 మంది పందెంరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగర శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న 35 మంది అరెస్ట్ చేశారు. వారి నుంచి 57వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా సంతమావులూరు మండలం బండివారిపాలెంలో పదమూడు మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా, పలు చోట్ల కోట్ల రూపాయిల్లో పందేలు జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయి.