ఫైనాన్స్ కంపెనీలపై పోలీసుల దాడులు | Police raid on finance companies | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్ కంపెనీలపై పోలీసుల దాడులు

Dec 17 2015 7:56 PM | Updated on Sep 17 2018 6:26 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'కాల్‌ మనీ' వ్యవహారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

నర్సరావుపేట (గుంటూరు) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'కాల్‌ మనీ' వ్యవహారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న పలువురిని అరెస్ట్ చేయడంతోపాటు ఫైనాన్స్ కంపెనీలపై నిఘా పెంచారు. తాజాగా గుంటూరు జిల్లా నర్సరావుపేటలో గురువారం సాయంత్రం నుంచి పలు ఫైనాన్స్ కంపెనీలతో పాటు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది పోలీసులు పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement