వేపాడ, పార్వతీపురంలలో.. నగదు పట్టివేత | police caught huge money at check posts | Sakshi
Sakshi News home page

వేపాడ, పార్వతీపురంలలో.. నగదు పట్టివేత

Mar 29 2014 1:46 AM | Updated on Apr 4 2019 2:50 PM

వేపాడ మండలంలోని సోంపురం జంక్షన్‌లో వల్లంపూడి పోలీసులు శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా రూ.2,97,550 పట్టుబడింది.

సోంపురం(వేపాడ) న్యూస్‌లైన్: వేపాడ మండలంలోని సోంపురం జంక్షన్‌లో వల్లంపూడి పోలీ సులు శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా రూ.2,97,550 పట్టుబడింది.  ఎస్సై బాలాజీరావు, ప్లయింగ్ స్క్వాడ్ చంద్రశేఖర్,  ఏఎస్సై దయానందరావు సంఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడ్డ నగదుపై విచారణ చేశారు.
 
ఇందుకు సంబంధించి పోలీస్ సిబ్బంది అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్.కోట మం డలం కుద్దువలస నుంచి ఎస్.కోట వైపు కారులో వెళ్తున్న పోతంపేట సర్పంచ్ కొరుపో లు ముత్యాలునాయుడు వద్ద  ఎటువంటి అధారాలులేకుండా ఉన్న నగదు రూ.1,02,050 పట్టుబడ్డాయి. తాము   కోళ్లఫారం పెట్టామని అందుకు సంబంధించిన  సొమ్ముచెల్లించడానికి తీసుకెళ్తున్నట్లు ముత్యాలు నాయుడు చెప్పారు.
 
కొట్యాడ నుంచి ఎల్.కోట వైపు వెళ్తున్న మల్లు శంకర్రావు వద్ద  ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో రూ.1,95,500 స్వాధీనం చేసుకున్నారు. ఎల్.కోట బ్యాం కులో వేయడానికి తీసుకెళ్తున్నట్లు శంకర్రా వు బ్యాంక్ పాసుపుస్తకం చూపిం చారు. అయినా ఆ సొమ్ముకు ఆధారాలు లేకపోవడంతో ఇద్దరి వద్ద పట్టుబడిన సొమ్మును సీజ్ చేశారు. కేసు నమోదుచేసి సొమ్మును వేపాడ తహశీల్దారు పి.అప్పలనాయుడుకు అప్పగించినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.
 
పార్వతీపురం చెక్‌పోస్టు వద్ద..
పార్వతీపురం టౌన్: పార్వతీపురంలోని నవిరి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద భారత్ ట్రేడర్స్‌కు సంబంధించిన రూ.1,87,850లు, గణేష్ గుప్త నుంచి 1,91,500లు, జట్టు ఆశ్రమం వద్ద ఒడిశాలోని కెరడ నుంచి పార్వతీపురం వస్తున్న జి.రవి వద్ద రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బి.వెంకటరావు, ఎలక్షన్ డీటీ జి.రామచంద్రరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement