ఫార్మసీ కౌన్సెలింగ్‌కు 97 మంది | Pharmacy counseling to 97 people | Sakshi
Sakshi News home page

ఫార్మసీ కౌన్సెలింగ్‌కు 97 మంది

Sep 17 2013 3:25 AM | Updated on Sep 1 2017 10:46 PM

ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం సోమవారం వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. బీఫార్మసీ, ఫార్మాడీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో చేరబోవు విద్యార్థులు భీమవరం బీవీ రాజు విద్యాసంస్థల్లోని సీతాపాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.

భీమవరం (టూటౌన్), న్యూస్‌లైన్ : ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం సోమవారం వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. బీఫార్మసీ, ఫార్మాడీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో చేరబోవు విద్యార్థులు భీమవరం బీవీ రాజు విద్యాసంస్థల్లోని సీతాపాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 24 మంది విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించినట్లు క్యాంప్ ఆఫీసర్ డీవీ సుబ్బారావు తెలిపారు. ఈనెల 22 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 17 నుంచి 22 వరకు కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. 
 
 తణుకులో..
 తణుకు అర్బన్: తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ వెబ్ కౌన్సెలింగ్‌కు 73 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ వై.రాజేంద్రబాబు తెలిపారు. ఎంసెట్‌లో 1 నుంచి 20 వేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఓసీ, బీసీ అభ్యర్థులు 70 మంది, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ముగ్గురు సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. మంగళవారం 20,001 నుంచి 33 వేల ర్యాంకులోపు అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 
 
 నేటినుంచి ఏలూరులో.. 
 ఏలూరు: స్థానిక సెయింట్ థెరిస్సా అటానమస్ కళాశాలలో మంగళవారం నుంచి ఎంసెట్-2013(బైపీసీ)లో ర్యాంకు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ తెలిపారు. మొదటిరోజు 1 నుంచి 20 వేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9493474281, 9441151156లో సంప్రదించాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement