
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ గురువారం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పాత గాజువాకలోని అనకాపల్లి బస్టాండ్ సెంటర్‌లో పార్టీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా, నంద్యాల లోక్ సభ సభ్యులు ఎస్పీవై రెడ్డి బుధవారం రాత్రి విజయవాడలో పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.