డబ్బిస్తేనే బిడ్డను చూపించారు | Patients problems in district hospital | Sakshi
Sakshi News home page

డబ్బిస్తేనే బిడ్డను చూపించారు

May 16 2015 4:22 AM | Updated on Sep 3 2017 2:06 AM

జిల్లా ఆస్పత్రిలో ఎదురవుతున్న ఇక్కట్ల ను పలువురు రోగులు ఇదే తరహాలో మొరపెట్టుకున్నారు.

కాన్పు చేస్తే డబ్బు అడుగుతున్నారు
రెండు రోజుల నుంచి డాక్టర్ రాలేదని ఓ వృద్ధుడి ఆవేదన
ఆస్పత్రిలో రోగుల సమస్యలు ఆలకించిన ఎమ్మెల్యే

 
   నా పేరు నాగ తులసి సార్. మాది జమ్మలమడుగు. రెండు రోజుల క్రితం కాన్పు కోసం ఆస్పత్రిలో చేరాను. మగబిడ్డ పుట్టాడు. రూ. వెయ్యి ఇస్తే గానీ లేబర్ వార్డులో సిబ్బంది బిడ్డను చూపించలేదు.
  నాపేరు శ్వేత. మాది శ్రీనివాసనగర్ మూడు రోజుల క్రితం ప్రసవ కోసం ఆస్పత్రిలో చేరాను. రక్తం తక్కువగా ఉందని, బయట ఎక్కించుకుని రమ్మని ఆస్పత్రి సిబ్బంది బయటికి పంపించారు. దాతను తీసుకొని వచ్చిన తరువాత ఆస్పత్రిలో చేర్పించుకున్నారు.
 
 ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో ఎదురవుతున్న ఇక్కట్ల ను పలువురు రోగులు ఇదే తరహాలో మొరపెట్టుకున్నారు. ఆస్పత్రి పరిశీలనకు వచ్చిన ప్రొ ద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వద్ద శుక్రవారం తమ గోడు వెళ్లబోసుకున్నారు.

  కొన్నేళ్ల నుంచి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల రెండు నెలల నుంచి పనికి రాలేదు. తర్వాత వచ్చినా, తనను పనిలో చేర్పించుకోలేదని మరియమ్మ వాపోయింది.
మోడంపల్లెకు చెందిన గౌసియా షుగర్ వ్యాధితో ఆస్పత్రిలో చేరింది. క్యాజువాలిటీలో ఉన్న ఆమెను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆమెకు పూర్తిగా నయం చేయాలని, అవసరమైతే ప్రయివేటు ఆస్పత్రికైనా తీసుకెళ్లి చికిత్స చేయించాలని  వ్యక్తిగత కార్యదర్శి పెంచలయ్యను ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశించారు.
  జమ్మలమడుగుకు చెందిన రామన్న షుగర్ వ్యాధితో ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలోని మందులు సరిపోకపోవడంతో అతను బయ ట డబ్బులు పెట్టి కొనాల్సి వస్తోంది. ఈ విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే షుగర్ వ్యాధికి కూడా మందులు లేకుంటే ఎలా అని ఆస్పత్రి అధికారులతో అన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి కనీస అవసరాలకు ఉపయోగపడే మందులు తెప్పించాలని చెప్పారు.
  మూడిండ్లపల్లెకు చెందిన ఐదో తరగతి వి ద్యార్థి రాజుకుమార్‌ను ఎమ్మెల్యే పరామర్శిం చారు. వైద్యం బాగా అందుతుందాని బాలుడి ని అడిగి తెలుసుకున్నారు. ఎర్రన్నకొట్టాలుకు చెందిన సుబ్బలక్షుమ్మ ఆయాసంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. సరైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని సూపరింటెండెంట్ బుసిరెడ్డితో అన్నారు.
ప్రొద్దుటూరుకు చెందిన రాజన్న వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చావాలనుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. బతికి ఉండి ఏమైనా సాధించవచ్చని అతనితో అన్నారు.
  ఆస్పత్రి ప్రాంగణంలో మదనపల్లెకు చెందిన మునెమ్మ అనే వృద్ధురాలు తీవ్ర నీరసంతో పడిపోయింది. ఆమెను చూసిన ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చేర్పించి వైద్య సహాయం చేయాలని సూపరింటెండెంట్ బుసిరెడ్డి, ఆర్‌ఎంవో డేవిడ్‌ు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement