పారా మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం | para medical counselling starts | Sakshi
Sakshi News home page

పారా మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం

Nov 15 2014 2:53 AM | Updated on Sep 2 2017 4:28 PM

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజియోథెరపీ), బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 5 ఆన్‌లైన్ కేంద్రాల్లో శుక్రవారం తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది.

విజయవాడ: బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజియోథెరపీ), బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 5 ఆన్‌లైన్ కేంద్రాల్లో శుక్రవారం తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిరోజు ఒకటి నుంచి 2,800 ర్యాంకు వరకు బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పిలిచారు. రాత్రి 8.30 వరకు 1,400 ర్యాంకు వరకే కౌన్సెలింగ్ జరిగింది.

ఐదు (విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్) కేంద్రాల్లో జరుగుతుండడంతో అభ్యర్థులు సీట్లు ఎంపిక చేసుకునే విషయంలో ఆలస్యమవుతోంది. ఓపెన్, రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు సమాంతరంగా కౌన్సెలింగ్ జరుగుతోంది. శనివారం జరిగే కౌన్సెలింగ్‌కు 2,801 నుంచి చివరి మెరిట్ ఆర్డర్ వరకు అభ్యర్థులను పిలిచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement