జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారుల కోసం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఆదివారం నిర్దేశిత కేంద్రాలలో పోలియో చుక్కలు వేసిన సిబ్బంది సోమవారం
కొనసాగుతున్న పల్స్ పోలియో
Feb 25 2014 1:06 AM | Updated on Sep 2 2017 4:03 AM
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారుల కోసం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఆదివారం నిర్దేశిత కేంద్రాలలో పోలియో చుక్కలు వేసిన సిబ్బంది సోమవారం ఇంటింటా సర్వే నిర్వహించి మిగిలిన వారికి చుక్కల మందు వేశారు. మంగళవారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి. పద్మావతి సిబ్బందిని ఆదేశించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె కొనసాగిస్తుండడంతో ఆశ కార్యకర్తలు, విద్యార్థినులతో దీనిని నిర్వహిస్తున్నారు. అయితే అంగన్‌వాడీల సమ్మెతో పల్స్‌పోలియో నిర్వహణ వైద్య, ఆరోగ్య శాఖకు ఇబ్బందులు కలిగించింది. కొన్ని ప్రాంతాల్లో చుక్కల మందు వృథా అయిందని తెలిసింది. కొందరు సిబ్బంది ఇంటింటికీ తిరగడంలేదని, ఫలితంగా చుక్కల మందు వ్యర్థమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ మూడు రోజుల్లో జిల్లాలోని 5,71,216 మందికి ఏడు లక్షల డోసులను అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Advertisement
Advertisement