రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Sep 5 2013 5:28 AM | Updated on Aug 30 2018 3:56 PM

వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే వృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మియాపూర్, న్యూస్‌లైన్: వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే వృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం, అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరిపల్లె గ్రామానికి చెందిన కుంచెపు శ్రీనివాస్(22) ధనుంజయ ట్రావెల్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం బాచుపల్లి వెళ్ళి మంగళవారం రాత్రి 11గంటల సమయంలో తిరిగి వస్తుండగా, మియాపూర్ రెడ్డిల్యాబ్స్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement