రాజ్‌భవన్‌కు భవనాన్ని కేటాయించిన ఏపీ ప్రభుత్వం

Old Irrigation Office In Vijayawada Made As Raj Bhavan - Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని పాత ఇరిగేషన్‌ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజ్‌భవన్‌కు కేటాయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇటీవల కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సూర్యారావుపేటలోని పాత ఇరిగేషన్‌ కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 24వ తేదీన విశ్వభూషణ్‌ ఏపీ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణం చేయించనున్నారు.

గవర్నర్‌ కార్యదర్శిగా ఎంకే మీనా
అలాగే గవర్నర్‌ కార్యదర్శిగా ముకేశ్‌కుమార్‌ మీనాను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎంకే మీనాకు.. గవర్నర్‌ కార్యదర్శిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top