7న నర్సింగ్ సీట్లకు వెబ్‌కౌన్సెలింగ్ | nursing seats web counseling on 7 | Sakshi
Sakshi News home page

7న నర్సింగ్ సీట్లకు వెబ్‌కౌన్సెలింగ్

Dec 30 2015 9:54 PM | Updated on Sep 3 2017 2:49 PM

ఏపీ, తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సుల్లో అడ్మిషన్లకు జనవరి 7న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్‌ బాబూలాల్ తెలిపారు.

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ, తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సుల్లో అడ్మిషన్లకు జనవరి 7న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్‌ బాబూలాల్ తెలిపారు. ఇంతకుముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఏడో తేదీన విజయవాడలోని హెల్త్ వర్సిటీలో, హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో వెబ్‌కౌన్సెలింగ్‌కుహాజరుకావాలన్నారు. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వికలాంగ అభ్యర్థులకు 7న ఉదయం 9 గంటలకు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఇంతకుముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులు నేరుగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని హెల్త్ వర్సిటీ తెలిపింది. జనవరి ఏడు, ఎనిమిది తేదీల్లో వెబ్‌లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో కలిపి బీఎస్సీ నర్సింగ్‌లో 4,104 సీట్లు భర్తీ కాగా, ఇంకా 2,332 సీట్లు, బీపీటీలో 852 సీట్లు భర్తీ కాగా, ఇంకా 222 సీట్లు, బీఎస్సీ ఎంఎల్‌టీలో 591 సీట్లు భర్తీ కాగా, ఇంకా 608 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా ధ్రువపత్రాలతో హాజరుకావాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement