నైజీరియాకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం మద్యం మత్తులో రెచ్చిపోయి స్థానిక యువకుడిపై దాడికి పాల్పడ్డారు.
యువకుడిపై కత్తితో దాడి.. వడ్డేశ్వరంలో ఉద్రిక్త పరిస్థితి
తాడేపల్లి రూరల్: నైజీరియాకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం మద్యం మత్తులో రెచ్చిపోయి స్థానిక యువకుడిపై దాడికి పాల్పడ్డారు.కేఎల్‌యూలో బీటెక్ సెకండియర్ చదువుతున్న నైజీరియాకు చెందిన అడిల్, మహ్మద్, క్రిస్టాఫర్, అహ్మద్, బీసీఏ సెకండియర్ చదువుతున్న వలిద్‌లు మద్యం సేవించేందుకు వడ్డేశ్వరంలోని ఓ వైన్‌షాపునకు వెళ్లారు. స్థానికులైన బురదగుంట సునీల్, మరో యువకుడు కూడా వైన్‌షాపునకు వెళ్లారు.
ఈక్రమంలో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసిన నైజీరియా విద్యార్థులు తమను చూసే నవ్వుతున్నారని భావించి, వారిపై తిరగబడ్డారు. మద్యం బాటిళ్లు పగలగొట్టి సునీల్‌పై కత్తితో దాడి చేశారు.అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు నైజీరియా విద్యార్థులను చితకబాదారు. వారిలో అహ్మద్ అనే విద్యార్థి గాయపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునీల్‌తో పాటు అహ్మద్‌ను వైద్యశాలకు తరలించారు. చివరికి పారిపోయిన నలుగురు విద్యార్థులను అదుపులోనికి తీసుకొని వారికి కేఎల్ వర్సిటీ హాస్టళ్లకు తరలించారు.