బెజవాడ బస్టాండ్‌లో భద్రత కరువు | Sakshi
Sakshi News home page

బెజవాడ బస్టాండ్‌లో భద్రత కరువు

Published Sat, Nov 30 2013 12:42 AM

Nevertheless, the safety of running drought

=నేరస్తులకు నెలవు
 = అలంకార ప్రాయంగా  అవుట్‌పోస్ట్
 =మొక్కుబడిగా సీసీ కెమేరాలు

 
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఆసియా ఖండంలో అతిపెద్దదిగా ఖ్యాతి గాంచిన నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేష న్‌లో ప్రయాణికుల వస్తు సామగ్రికి భద్రత ఉం డటంలేదు. ఇక్కడ తరచూ చోటుచేసుకుం టున్న ఘటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇక్కడ భద్రత విషయంలో పోలీసు, ఆర్టీసీ అధికారులు ఎవరికి వారు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇక్క డ దొంగలు, మోసగాళ్లు మకాం పెట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను దోచుకుంటున్నారు.

గురువారం రాత్రి ఓ మహిళ నుంచి బంగారు, వజ్రాభరణాలను ఓ ముఠా పకడ్బందీ వ్యూహంతో దోచుకోవడం ఇక్కడ భద్రతా లేమిని మరోసారి రుజువు చేసింది. నగరంలో శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు మస్కా కొట్టి ఓ బ్యాచ్ భారీగా బం గారు ఆభరణాలు దోచుకుంది. ఇక్కడ నెలకు 20 వరకు చిన్న, పెద్ద దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు, చిల్లర దొంగలు బస్టాండ్‌లో స్వైరవిహారం చేసి డబ్బు, నగలు, ల్యాప్‌టాప్‌లు అపహరించుకుపోతున్నారు.

హైదరాబా ద్, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ముఖ్య నగరాలతో పాటు రాయలసీమ, తెలంగాణ  ప్రాంతాల నుంచి నగరానికి రోజుకు లక్షా 70 వేల మంది వచ్చి వెళుతుంటారని అంచనా. పం డుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి 2,750 వరకు ట్రిప్పులు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అంటే వివిధ ప్రాం తాల నుంచి గంటకు 115 బస్సులు ఇక్కడి బ స్టాండ్‌లోకి వచ్చివెళుతుంటాయి. ఇటీవల కాలంలో నగరం వాణిజ్యం, విద్య, వైద్యపరం గా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఆయా రంగాలకు సంబంధించి సేవలు గత పదేళ్లలో రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ప్రముఖ దేవాల యాల్లో ఒకటైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో నగరంలోని బస్టాం డ్‌లో రద్దీ అధికంగా ఉంటుంది.
 
అలంకార ప్రాయంగా అవుట్‌పోస్ట్...


ఇంత  పెద్ద బస్టాండ్‌లో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన అవుట్‌పోస్టు కేవలం అలంకార ప్రాయంగా ఉంది. ఇందులో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు ఉం టారు. బస్టాండ్‌లో ఉన్న అరైవల్, డిపార్చర్ బ్లా కులు, సిటీ టెర్మినల్‌లో సెక్యూరిటీకి ఈ ఐదుగురే దిక్కు. వీరు మూడు షిప్టుల్లో డూటీలు చేస్తుంటారు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా వి ధ్వంసకాండ వంటి ఘటనలు చోటుచేసుకున్నపుడు బాంబ్‌స్క్వాడ్ ఇక్కడ తనిఖీలు చేస్తుం టుంది. నగరంలో మరేదైనా సంఘటనలు జరి గితే అవుట్‌పోస్టులో సిబ్బందిని కుదించి అక్కడకు పంపిస్తుంటారు.

బస్టాండ్‌లో భద్రతాపరంగా పోలీసులకు సంబంధించి సరైన అజమాయిషీ కనపడటంలేదు. తాగుబోతులు, చిల్లర నేరస్తులు స్వైర విహారం చేస్తుంటారు. వారిని నియంత్రించడంలో ఈ ఐదుగురూ తలమునకలవుతుంటారు. ఈ నేపథ్యంలో దొంగలు, దోపిడీదారులను గుర్తించేందుకు పోలీసుల నిఘా ఉండటంలేదు. దాంతో నేరగాళ్లు బస్టాండ్‌లో మకాం పెట్టి దోపిడీలకు పాల్పడుతున్నారు.
 
మొక్కుబడిగా సీసీ కెమేరాలు ...


బస్టాండ్‌లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల పనితీరు నాశిరకంగా ఉంది. 61 ప్లాట్‌ఫారాల్లో కీలకమైనచోట్ల వీటిని ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ అవుట్‌పోస్టుకు అనుసంధానం చేశారు. అయితే ఈ కెమేరాలు సరిగా పనిచే యటం లేదని పోలీసులు చెపుతున్నారు. వీటి ద్వారా నమోదయ్యే దృశ్యాల్లో స్పష్టత ఉండటం లేదు. దీంతో నేరాలు జరిగినపుడు ఈ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించలేకపోతున్నామని పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని కొత్త కెమేరాలను అర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు.

మిగిలిన వాటి స్థానంలో కూడా కొత్తవి ఏర్పాటు చేస్తే నేరాలు జరిగినప్పుడు దొంగలను గుర్తించటానికి వీ లుంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, బస్టాండ్‌లో కూడా పాత నేరస్తుల ఫొటోలు అందరికీ కనపడే ప్రదేశంలో ఏర్పాటు చే యా ల్సి ఉంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాత్రమే వీటిని ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నా రు. రద్దీ సమయాల్లో దొంగలకు సంబంధించిన సమాచారాన్ని మైకుల ద్వారా పదేపదే హెచ్చరికలు జారీ చేసే బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, బస్టాండ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ప్రయాణికులు  కోరుతున్నారు. అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement