వెంకటగిరితో నెహ్రూ అనుబంధం | Nehru is associated with venkatagiri | Sakshi
Sakshi News home page

వెంకటగిరితో నెహ్రూ అనుబంధం

Nov 14 2014 3:48 AM | Updated on Mar 18 2019 9:02 PM

వెంకటగిరితో నెహ్రూ అనుబంధం - Sakshi

వెంకటగిరితో నెహ్రూ అనుబంధం

వెంకటగిరిటౌన్ దేశ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు వెంకటగిరితో అనుబంధం ఉంది.

నేడు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం
 
వెంకటగిరిటౌన్ దేశ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు వెంకటగిరితో అనుబంధం ఉంది. చాచా నెహ్రూ జయంతిని శుక్రవారం జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం. స్వాతంత్య్ర కోసం ముమ్మరంగా ఉద్యమం సాగుతున్న తరుణమది. 1936, అక్టోబర్ 18న జవహర్‌లాల్ నెహ్రూ వెంకటగిరిలో కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభకు హాజరయ్యారు. నెహ్రూ సభ కోసం స్థానిక రాజా నివాస్ భాగ్ ప్రాంతంలో వేదిక ఏర్పాటు చేశారు.

నెహ్రూ సభావిశేషాలు

వెంకటగిరిలో 1936లో నెహ్రూ పాల్గొన్న సభ జోరువానలో సాగింది. ఆ రోజుల్లో సుమారు 10 వేల మంది హాజరయ్యారు. సభాస్థలానికి నెహ్రూ కారులో వచ్చారు. అప్పటి వరకూ మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఒక్కసారిగా జోరువాన కురిసింది. దీంతో సభావేదిక మీద ఉన్న పెద్దలు నెహ్రూ వస్తూ కారులో వర్షాన్ని తీసుకొచ్చారని చమత్కరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement