విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ | Narendra modi reaches visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ

Oct 14 2014 1:42 PM | Updated on Aug 15 2018 2:20 PM

విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ - Sakshi

విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన మంగళవారం మధ్యాహ్నం సైనిక విమానం ఐఎన్ఎస్ డేగాలో నగరానికి వచ్చారు

విశాఖ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన మంగళవారం మధ్యాహ్నం  సైనిక విమానం ఐఎన్ఎస్ డేగాలో నగరానికి వచ్చారు.  తుఫానుకు దెబ్బతిన్న విమానాశ్రయాన్ని మోడీ పరిశీలించారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా విశాఖ కలెక్టరేట్కు వెళ్లనున్నారు. 

 

కలెక్టరేట్లో మోడీ తుఫాను సహాయక కార్యక్రమాలు, నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. రోడ్డు ప్రాంతంలో ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. మోడీ సుమారు రెండు గంటల పాటు విశాఖలో ఉంటారు. మధ్యాహ్నం 3.20కి ఆయన తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళతారు.

Advertisement
 
Advertisement
Advertisement