మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే | N.Raghuveera reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే

May 19 2015 12:38 PM | Updated on Mar 23 2019 9:10 PM

మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే - Sakshi

మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే

ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్లో మండిపడ్డారు.

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్లో మండిపడ్డారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ పేర్కొంటే... కాదు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాడిన సంగతి తెలిసిందే. విభజన జరిగి ఏడాది కావస్తున్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు నాన్చుడు ధోరణి అవలంబించడంపై రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement