ఇన్నాళ్లు లేనిది ముస్లింలపై చంద్రబాబుకు ఇప్పుడు హటాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది.
‘ఉప ఎన్నికతో ముస్లిం సంక్షేమం గుర్తొచ్చిందా’
Aug 21 2017 1:02 PM | Updated on Oct 19 2018 8:10 PM
విజయవాడ: ఇన్నాళ్లు లేనిది ముస్లింలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు హటాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. అంత ప్రేమే ఉంటే తన మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా ఎందుకు చోటు కల్పించలేదని ముస్లిం మైనార్టీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముఖ్తార్ అలీ అహ్మద్ ప్రశ్నించారు.
ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నంద్యాల ఎన్నికలతోనే ముస్లింల సంక్షేమం గుర్తుకు వచ్చిందా? ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా ప్రార్థనా మందిరాలను తొలగించినప్పుడు గుర్తుకు రాలేదా? ముస్లింల మనోభావాలను గౌరవించకుండా ఇన్నాళ్లు ప్రభుత్వం వ్యవహరించింది. ఎన్నికలు వచ్చేసరికి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టి మభ‍్యపెట్టడానికి యత్నిస్తున్నారు. ఈ కుట్రలన్నిటికీ ఓటు ద్వారానే మైనార్టీలు తమ తీర్పు వెల్లడిస్తారన్నారు.
Advertisement
Advertisement