రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్ | murali mohan invites railway minister to rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్

Oct 18 2014 1:44 PM | Updated on Sep 2 2017 3:03 PM

రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్

రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్

పాడైపోతున్న రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని సందర్శించాల్సింగా రైల్వే మంత్రి సదానంద గౌడను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆహ్వానించారు.

పాడైపోతున్న రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని సందర్శించాల్సింగా రైల్వే మంత్రి సదానంద గౌడను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆహ్వానించారు. హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వీటి పునరుద్ధరణకు వెంటనే పనులు చేపట్టాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు.

హుదూద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అలాగే విద్యుత్ శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయంలోనూ సాయం చేయాలని తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరానని మురళీ మోహన్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement