కాపు ఉద్యమం నుంచి తప్పుకొంటా: ముద్రగడ | Mudragada Padmanabham Open Letter Over Criticism On Him | Sakshi
Sakshi News home page

కాపు ఉద్యమం నుంచి తప్పుకొంటా: ముద్రగడ

Jul 13 2020 6:45 PM | Updated on Jul 13 2020 6:50 PM

Mudragada Padmanabham Open Letter Over Criticism On Him - Sakshi

సాక్షి, విజయవాడ: టీవీ కార్యక్రమాలు, సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పదవులు, డబ్బు కోసం తాను ఉద్యమం చేయలేదని.. కాపు జాతికి మంచి జరిగేలా ఎన్నో ప్రయత్నాలు చేశానని గుర్తు చేశారు. తనను విమర్శిస్తున్న వారు ముందుండి నడిచి.. కాపులకు బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు... ‘‘సోషల్‌ మీడియాలో నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియదు. నేను ఉద్యమం చేయడానికి కారణం చంద్రబాబే. గతంలో ఆయన కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. నాపై విమర్శలు చేసేవాళ్లు డ్రైవర్‌ సీటులో కూర్చుని.. కాపులకు బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలి’’అని సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement