అవాస్తవాలను రాస్తే చట్టపరమైన చర్యలు

MLA Manugunta Mahidhar Reddy Serious Over The False News - Sakshi

ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి

సాక్షి, ఒంగోలు: తనపై కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను అసంతృప్తిగా ఉన్నానంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. అందుకే ప్రశ్నించానని వివరణ ఇచ్చారు. (ఇసుక విక్రయాలు మరింత పారదర్శకం..)

ఏ సీఎం చేయని గొప్ప కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గంలో కూడా అడిగినవన్నీ చేస్తున్నారని ఆయన  తెలిపారు. జిల్లాలో కొందరు కిందస్థాయి అధికారులు పనిచేయడం లేదని, బిల్లులు చేయమని మాత్రమే నిలదీశానన్నారు. తప్పుడు రాతలు రాసే పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి హెచ్చరించారు.  (ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే దుష్ప్రచారం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top