
సాక్షి, అమరావతి: వచ్చే నెల 1న మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తొమ్మిది రోజుల విదేశీ పర్యటన వివరాలను సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు వివరించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. కాగా, దుబాయ్, అమెరికా, ఇంగ్లండ్ దేశాల పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల గవర్నర్ తల్లి మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సీఎం విజయవాడకు చేరుకుంటారు.