విశాఖలో ఏడు కంటైన్‌మెంట్‌ జోన్లు.. | Minister Kannababu Said Seven Containment Zones Have Been Identified In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ఏడు కంటైన్‌మెంట్‌ జోన్లు..

Apr 10 2020 4:40 PM | Updated on Apr 10 2020 4:44 PM

Minister Kannababu Said Seven Containment Zones Have Been Identified In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కరోనా మొదటి కేసు నమోదయినప్పటి నుంచి నియంత్రణ చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. విశాఖలో ఏడు కంటైన్‌మెంట్‌ జోన్లు గుర్తించామన్నారు. 2.6 లక్షల మంది ఈ జోన్‌ల్లో ఉన్నారన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామ వాలంటీర్లను ఆదేశించామని తెలిపారు. స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో 148 క్రిటికల్‌ , 500 నాన్‌ క్రిటికల్‌ పడకలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. గీతం, అపోలో తదితర ఐదు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 2,188 పడకలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement