అది రాజకీయ గర్జన: మంత్రి గంటా శ్రీనివాసరావు | Minister gantasrinivasaravu Comment on kapugarjana | Sakshi
Sakshi News home page

అది రాజకీయ గర్జన: మంత్రి గంటా శ్రీనివాసరావు

Published Sun, Jan 31 2016 6:37 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

తునిలో ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు గర్జన పూర్తిగా రాజకీయ గర్జనగా మంత్రి గంటా పేర్కొన్నారు.

తునిలో ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు గర్జన పూర్తిగా రాజకీయ గర్జనగా మంత్రి గంటా పేర్కొన్నారు. కాపుల ప్రయోజనాలను రాజకీయ పార్టీలు దెబ్బతీయొద్దన్నారు. ముద్రగడ గర్జనకు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు భుజాన వేసుకుంటున్నాయని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లపై బీసీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా కాపులను బీసీల్లో చేర్చడానికి సీఎం కట్టుబడి ఉన్నారని, చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి, కాపు కార్పొరేషన్, మంజునాథ కమిషన్ ఏర్పాటు ఇందులో భాగమేనన్నారు. 9 నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చాక శాస్త్రీయంగా కాపులను బీసీలో చేర్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement