వర్సిటీ స్థల ఆక్రమణపై నివేదిక ఇవ్వండి | minister ganta on yogi vemana university land occupation | Sakshi
Sakshi News home page

వర్సిటీ స్థల ఆక్రమణపై నివేదిక ఇవ్వండి

Jul 29 2017 1:28 PM | Updated on Sep 5 2017 5:10 PM

యోగి వేమ‌న విశ్వవిద్యాల‌యం(వైవీయూ) ప‌రిధిలోని భూముల కబ్జా ఆరోప‌ణ‌ల‌పై మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆరా తీశారు.

విశాఖపట్నం: యోగి వేమ‌న విశ్వవిద్యాల‌యం(వైవీయూ) ప‌రిధిలోని భూముల కబ్జా ఆరోప‌ణ‌ల‌పై మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆరా తీశారు. వైవీయూ వీసీతో ఆయన మాట్లాడగా ప్రహరీ లేక‌పోవ‌డంతో భూ ఆక్రమ‌ణ ప్రయ‌త్నం జ‌రిగింద‌ని వీసీ తెలిపారు. వీసీల స‌మావేశంలో ప్రహరీ ఏర్పాటు చేసుకోవాల‌ని యూనివర్సిటీల‌కు మంత్రి సూచిస్తునే ఉన్నారు. ఇప్పటికైనా అన్ని యూనివర్సిటీలు వెంట‌నే ప్రహరీలు నిర్మించుకోవాల‌ని మంత్రి సూచిస్తున్నారు. ఈ భూ కబ్జా ఆరోప‌ణ‌ల‌పై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాల‌ని, భూమి కబ్జాకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వీసీని మంత్రి ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement