
సాక్షి, మార్కాపురం: ‘మనబడి నాడు-నేడు’పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కార్యాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులకు ఇప్పటికే సప్తగిరి ఛానెల్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ద్వారా కూడా ఆడియో తరగతులు నిర్వహించి.. పరీక్షల వరకు విద్యార్థులకు పాఠాలు వినిపించాలని మంత్రి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.