జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ నేతల వాగ్వివాదం చోటు చేసుకుంది.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ నేతల వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం సమావేశం ప్రారంభంకాగానే నగరంలో రోడ్ల దుస్థితిపై మేయర్‌ను బీజేపీ కార్పొరేటర్లు నిలదీశారు. వెంటనే మేయర్ రాజీనామా చేయాలంటూ పోడియంను చుట్టు ముట్టారు. వీరికి ఎంఐఎం సభ్యులు అడ్డుతగిలారు.
బీజేపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. రెండు పార్టీల నాయకుల వాదోపవాదాలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. పరస్పరం మాటల తూటాలు విసురుకోవడంతో సమావేశం స్తంభించింది. పోడియం చుట్టుముట్టిన బీజేపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. మరోవైపు వినాకయక చవితి పండగను నిర్లక్షం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.