భర్తతో వివాదం.. భార్య ఆత్మహత్య | married woman commits suicide | Sakshi
Sakshi News home page

భర్తతో వివాదం.. భార్య ఆత్మహత్య

Mar 29 2017 1:50 PM | Updated on Nov 6 2018 7:53 PM

భర్తతో ఏర్పడ్డ వివాదంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

ఎడ్లపాడు(గుంటూరు): భర్తతో ఏర్పడ్డ వివాదంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడులో జరిగింది. దీనిపై  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన వాసిమళ్ల మహేంద్ర మొదటి భార్య కొన్నేళ్ల కింద చనిపోగా శౌరీలుని ఇటీవల వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లే. శౌరీలు ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ. అయితే మహేంద్ర మొదటి భార్యకి ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలోనే భార్యను గర్భం తీయించుకోవాలని కొన్ని రోజులుగా కోరుతున్నాడు. ఈ విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం ఇద్దరూ గొడవపడ్డారు. బుధవారం ఉదయం మహేంద్ర పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శౌరీలు ఉరి వేసుకుంది. ఇరుగుపొరుగు వారు చూసేసరికే ఆమె చనిపోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement