ముందే వచ్చిన మధురఫలం | Mango Fruits Sales Starts Before Summer in West Godavari | Sakshi
Sakshi News home page

ముందే వచ్చిన మధురఫలం

Mar 23 2020 12:51 PM | Updated on Mar 23 2020 12:51 PM

Mango Fruits Sales Starts Before Summer in West Godavari - Sakshi

పశ్చిమగోదావరి ,కాళ్ల: మే నెలలో రావాల్సిన మామిడి పళ్లు ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా మామిడి పళ్లు ఇష్టపడని వారుండరు. అయితే సీజన్‌కన్నా ముందు రావడంతో వాటిని కొనేందుకు మామిడి పళ్ల ప్రియులు ఎగబడుతున్నారు. మండలంలోని సీసలి గ్రామంలో రోడ్డును ఆనుకుని మామిడి పళ్లు విక్రయిస్తున్నారు. గ్రామానికి చెందిన నాగిశెట్టి సుబ్బారావు మామిడి పళ్లను విక్రయిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ముందుగా మండలంలో మామిడి కాయలు ప్రత్యక్షమవ్వడంతో రేటు వెచ్చించైనా కొనేందుకు మామిడి కాయ ప్రియులు ఇష్టపడుతున్నారు. నూజివీడు నుంచి ముందు కాపు కాయలు చిన్నరసాలు దిగుమతి చేసినట్లు వ్యాపారి చెబుతున్నాడు. చిన్న రసాలు డజను రూ.400 నుంచి రూ.500 వరకూ విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు. అదే విధంగా పెద్ద రసాలు పచ్చళ్లు పెట్టుకునేందుకు డజను రూ.150 నుంచి రూ.250 వరకూ విక్రయిస్తున్నట్లు చెప్పాడు. నూజివీడు రసాలంటే  మన ప్రాంతలో ప్రత్యేకత ఉంది. వీటిని కొనేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement