బోర్ లారీ యాక్సైల్ పడి వ్యక్తి మృతి | man died in bore lorry accident | Sakshi
Sakshi News home page

బోర్ లారీ యాక్సైల్ పడి వ్యక్తి మృతి

Feb 25 2015 7:23 PM | Updated on Sep 2 2017 9:54 PM

బోర్‌లారీ యాక్సైల్ రోడ్డుపై ప్రయాణిస్తున్న పాదచారులపై పడటంతో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

పలమనేరు (చిత్తూరు): బోర్‌లారీ యాక్సైల్ రోడ్డుపై ప్రయాణిస్తున్న పాదచారులపై పడటంతో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈసంఘటన బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన పరమేష్(21), సంజీవ్(22) పలమనేరులోని ఇండస్ట్రియల్ పవర్‌లూమ్‌లో పనిచేస్తున్నారు. కాగా, బుధవారం చెన్నై-బెంగళూరు జాతీయరహదారిపై నడుస్తుండగా బోర్‌లారీ యాక్సైల్ పడింది. ఈ ప్రమాదంలో పరమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement