యంత్రం కింద తలపెట్టి ఆత్మహత్య | Man commits suicide | Sakshi
Sakshi News home page

యంత్రం కింద తలపెట్టి ఆత్మహత్య

Dec 1 2015 3:46 PM | Updated on Nov 6 2018 7:56 PM

మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలోని గోపాలకృష్ణ గ్రానైట్ క్వారీ వద్ద విషాదం చోటుచేసుకుంది.

మద్దిపాడు (ప్రకాశం జిల్లా) : మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలోని గోపాలకృష్ణ గ్రానైట్ క్వారీ వద్ద విషాదం చోటుచేసుకుంది. చంద్రమోహన్ మెహతా(40) అనే కార్మికుడు గ్రానైట్ బండరాళ్లను కోసే యంత్రం కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతని తల, మొండెం రెండూ వేరయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న మద్దిపాడు సీఐ సంజీవ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రమోహన్ స్వస్థలం పశ్చిమబెంగాల్. నాలుగు నెలల క్రితం క్వారీలో చేరాడు. నాలుగు రోజులుగా ఏదో బాధతో ఉన్నట్లు కనిపించిందని తోటి కార్మికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement