గ్రామీణ ప్రాంతాల్లో గ్రహణ సమయంలో ఇంటి ఆవరణలో నీళ్లతో నిండిన పళ్లెం ఉంచి దానిలో రోకళ్లను నిలబెట్టి పూజలు చేయడం అనాదిగా వస్తోంది.
ముక్కామల (పెరవలి): గ్రామీణ ప్రాంతాల్లో గ్రహణ సమయంలో ఇంటి ఆవరణలో నీళ్లతో నిండిన పళ్లెం ఉంచి దానిలో రోకళ్లను నిలబెట్టి పూజలు చేయడం అనాదిగా వస్తోంది. సాధారణంగా రోకలి పళ్లెంలో నిలబడదు. అరుుతే గ్రహణ సమయంలో మాత్రమే భగవంతుని కృప వల్ల నిలబడుతుందని గ్రామీణుల విశ్వాసం. శనివారం చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ముక్కామలలో అఖండం వెంకటేశ్వరరావు ఇంటి ఆవరణలో పళ్లెంలో రోకలిని నిలబెట్టగా అది నిలబడింది. దీని వద్ద వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు పూజలు చేశారు.