ప్రేమించిన పాపానికి.. కత్తిపోట్లు.. | Lover relatives attacked with a knife | Sakshi
Sakshi News home page

ప్రేమించిన పాపానికి.. కత్తిపోట్లు..

May 12 2017 8:07 PM | Updated on Jun 1 2018 8:36 PM

ప్రేమించిన పాపానికి.. కత్తిపోట్లు.. - Sakshi

ప్రేమించిన పాపానికి.. కత్తిపోట్లు..

సుభాష్‌రోడ్డు నామాటవర్స్‌ సమీపంలో ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.

అనంతపురం: నగరంలో సుభాష్‌రోడ్డు నామాటవర్స్‌ సమీపంలో ఓ వ్యక్తిపై  విచక్షణా రహితంగా దాడి చేయడం కలకలం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు.. నల్లచెరువు మండలానికి చెందిన లక్ష్మీపతినాయుడు నగరంలో భైరవనగర్‌లో నివాసముంటున్నాడు. అదే మండలానికి చెందిన అమ్మాయిని సంవత్సర కాలంగా ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం నిశ్చయించి, శుక్రవారం  హరిప్రియ ఫంక్షన్‌హాల్లో వివాహం జరిపించారు.

దీంతో లక్ష్మీపతినాయుడు ఫంక్షన్‌హాల్‌ సమీపంలో మాటు వేశాడు. ఇది గమనించిన వధువు తరుఫు బంధువులు కత్తులు, రాడ్లతో అతడిపై దాడి చేశారు.  క్షతగాత్రున్ని స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ వెంకటరమణ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితుడితో ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement