ఓ ప్రేమజంటపై పోలీస్ స్టేషన్ ఎదుటే దాడి చేసిన ఘటన పలమనేరులో మంగళవారం సంచలనం రేపింది.
న్యాయం చేయాలంటూ స్టేషన్‌లోనే నిరసన
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పలమనేరు: ఓ ప్రేమజంటపై పోలీస్ స్టేషన్ ఎదుటే దాడి చేసిన ఘటన పలమనేరులో మంగళవారం సంచలనం రేపిం ది. గాయపడిన ప్రేమికులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొనేంత వర కు వైద్యం కూడా చేయించుకోమంటూ పోలీస్ స్టేషన్‌లో కొంతసేపు నిరసన తెలిపారు. డీఎస్పీ శంకర్ వచ్చి వారికి హామీ ఇచ్చాకే ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం వెళ్లారు. పలమనేరు ముత్తాచారిపాళెంకు చెందిన చంద్రశేఖర్ కుమారుడు హేమగిరి స్థానికంగా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇదే ప్రాంతంలోని బం దువుల ఇంటికి బెంగళూరుకు చెందిన హిమశ్రీ గతంలో వచ్చేది. హేమగిరి, హిమశ్రీ పరస్పరం ప్రేమించుకున్నారు. హిమ శ్రీ గతనెల 29న బెంగళూరులోని ఇంటినుంచి పారిపోయి పలమనేరులోని ప్రియుని చెంతకు చేరింది. వీరిరువురూ తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. కుమార్తె అచూకీ కోసం హిమశ్రీ తల్లిదండ్రులు గాలించి బెంగళూరు పోలీసులకు ఆ మరుసటి రోజు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కుమార్తె పలమనేరులో ఉందని తెలుసుకున్న హిమశ్రీ కుటుం బీకులు మూడు రోజుల క్రితం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. హేమగిరి కుటుం బీకుల ను పోలీసులు పిలిపించి వెంటనే ప్రేమజంటను రప్పించాలని ఆదేశించా రు. మంగళవారం ఈ ప్రేమజంట స్థానిక స్టేషన్ వద్దకు చేరుకుంది. తాము మేజర్లమని, ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. స్టేషన్ నుంచి బయటికొచ్చిన వీరిని హిమశ్రీ కుటుంబీకులు మూకుమ్మడిగా చితకబాదారు. గాయపడిన ప్రేమికులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శంకర్ ఇక్కడికి చేరుకుని ఆ ప్రేమికులను స్థానిక వంద పడకల ఆస్పత్రికి పంపారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.